CHHAAVA: ఓటీటీ లోకి బ్లాక్ బస్టర్ ‘ఛావా’..ఎక్కడంటే 7 d ago

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 11వ నుంచి స్ట్రీమింగ్ ఛావా స్ట్రీమింగ్ కానుంది.